ప్రతిష్టాత్మక గామా – 2025 వేడుకకు దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్ వేదిక కానుంది. దుబాయ్‌లో నాలుగేళ్లుగా, ప్రతి ఏడాదీ వైభవంగా ఈ అవార్డుల వేడుక జరిగిన నేపథ్యంలో, ఆగస్ట్ 30న జరుగనున్న ఈ అయిదవ ఎడిషన్, తొలి నాలుగు ఎడిషన్స్‌ని మించి అత్యంత వైభవంగా జరుపనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఓ థీమ్ సాంగ్‌ను దుబాయ్‌లో లాంచ్ చేశారు. గీతరచయిత చంద్రబోస్ రాసిన ఈ పాటను రఘు కుంచె స్వరపరచి ఆలపించారు. ఆగస్ట్ 30న టాలీవుడ్ అవార్డ్స్‌తో పాటు, ఆగస్ట్ 29న ఎక్సలెన్స్ అవార్డుల వేడుకను కూడా నిర్వహించేలా భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా, కిరణ్ అబ్బవరం, శ్రీవిష్ణు, రోషన్, మీనాక్షి చౌదరి, దక్ష నగార్కర్ తదితరులు పాల్గొనబోతున్నారు.
