Namaste NRI

రిప‌బ్లిక్ డే కానుక‌గా గాంధీ తాత చెట్టు

టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ సినిమా ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాను రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 24న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీ స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించాయి. న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, శేష సింధు రావులు నిర్మాత‌లు. ప‌ద్మావ‌తి మ‌ల్లాది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి త‌బితా సుకుమార్ స‌మ‌ర్ప‌కురాలిగా వ్య‌వ‌హ‌రించారు.

ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మాట్లాడుతూ  గాంధీ సిద్ధాంతాల్ని ఆదర్శంగా తీసుకుని,  ఆయన బాటలో నడిచే ఓ పదమూడేళ్ల బాలిక కథ ఈ చిత్రం. తన పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఈ బాలిక ఏం చేసిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సందేశాత్మక చిత్రం అందరి హృదయాలను కదిలిస్తుంది అని చెప్పారు. కాగా, ఈ సినిమా ఇప్పటికే పలు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో పురస్కారాలు కైవసం చేసుకుంది. అలాగే, బాల నటిగా సుకృతి వేణి అవార్డు దక్కించుకోవడం విశేషం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events