Namaste NRI

గం..గం..గణేశా ట్రైల‌ర్ రిలీజ్ టైం ఫిక్స్

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దొర‌సాని అంటూ తొలి చిత్రంతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఇక గ‌త ఏడాది బేబి సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్‌తో ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నాడు ఆనంద్‌. ఇందులో ఒక‌టి గం..గం..గణేశా. ఫ‌న్ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్‌ శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

ఇదిలావుంటే మూవీ నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ అప్‌డేట్ ఇచ్చారు.ఈ సినిమా ట్రైల‌ర్‌ను రేపు సాయంత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఓవైపు కామెడీతో పాటు మరోవైపు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌టంతో మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events