చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్ స్టర్. వైల్డ్ వారియర్ ప్రొడక్ష న్స్ లో రవి, నరసింహా సమర్పణలో ఈ చిత్రానికి కొరియోగ్రఫీ, ఎడిటింగ్, ఫైట్స్ అందించడమే కాదు నిర్మిస్తూ దర్శకత్వం వహించారు చంద్రశేఖర్ రాథోడ్. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బోగేంద్ర గుప్తా, డైరెక్టర్ డాక్టర్ కాజా, డిస్ట్రిబ్యూటర్ అచ్చిబాబు ఎం అతిథులుగా పాల్గొన్నారు.
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సినిమాకు ఒక డిపార్ట్ మెంట్ వర్క్ చేయడమే కష్టం. అలాంటి ది నాలుగైదు క్రాప్ట్స్ చేస్తూ దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ హీరోగా నటించడం మామూలు విషయం కాదు. చంద్రశేఖర్ లాంటి వాళ్లు నిజంగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలి. వీళ్లు ఇండస్ట్రీకి అవసరం, ప్రేక్షకులకు కూడా అవసరం. గ్యాంగ్ స్టర్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.
హీరోయిన్ కాశ్వీ కాంచన్ మాట్లాడుతూ గ్యాంగ్ స్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషం గా ఉంది. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు చంద్రశేఖర్ గారికి థ్యాంక్స్. 24 గంటలు కష్టపడేం త ప్యాషన్ సినిమా మీద ఉన్న వ్యక్తి ఆయన. ఈ సినిమా బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గ్యాంగ్ స్టర్ సినిమా ఆగస్టులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.