Namaste NRI

రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న గీతా శంకరం

ముఖేష్‌గౌడ్‌, ప్రియాంక శర్మ జంటగా రూపొందుతోన్న ప్రేమకథాచిత్రం గీతా శంకరం. రుద్ర దర్శకత్వం. కె.దేవానంద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్నది. మరోవైపు ఈ సినిమా పాటల రికార్డింగ్‌ని పూర్తి చేశారు. మంచి కంటెంట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిదని, భావోద్వేగాలతో కూడుకున్న స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతున్నదని, త్వరలో ప్రమోషన్స్‌ మొదలు పెడతామని నిర్మాత తెలిపారు. కొత్తదనంతో కూడుకున్న ప్రేమకథ ఇదని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ ధూపాటి, సంగీతం: అభు. పాటలు: చంద్రబోస్‌, నిర్మాణం: ఎస్‌ఎస్‌ఎంజీ ప్రొడక్షన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress