అంజలి టైటిల్ పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ గీతాంజలి మళ్లీ వచ్చింది. రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకుడు. ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అంజలి మాట్లాడుతూ గీతాంజలి నా కెరీర్‌లో తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. పదేళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా చాలా పెద్ద హిట్టయ్యింది. ఇప్పుడు అదే నమ్మకంతో గీతాంజలి మళ్లీ వచ్చింది చేశా. ఈ సీక్వెల్‌లో విజువల్స్ మరో స్థాయిలో ఉంటాయి అని చెప్పింది. సీక్వెల్‌లో ఎక్కువ తారాగణం కనిపిస్తుంది. ఆలీ, సునీల్, సత్య, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్ బాగా నవ్విస్తారు. గీతాంజలి ముద్దుగా కనిపించినా తను చేసే పనులు మాత్రం భయపెడతాయి అని చెప్పింది. ఈ సీక్వెల్ చేయడానికి పదేళ్లు పట్టిందని, ఊటీ నేపథ్యంలో ఆద్యంతం వినోదంతో అందరి అంచనాలను అందుకుంటుందని, సంక్రాంతికి టీజర్‌ను విడుదల చేస్తామని సమర్పకుడు కోన వెంకట్ అన్నారు. సీక్వెల్‌కు మంచి టీమ్ కుదిరిందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కథ: కోన వెంకట్, నిర్మాణ సంస్థలు: ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్, దర్శకత్వం: శివ తుర్లపాటి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)