ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గీత సాక్షిగా. పుష్పక్, జేబీహెచ్‌ఆర్‌ఎన్‌కేఎల్ సమ్పరణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో అద్భుతమైన టీజర్‌ని విడుదల చేశారు. పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుణ్ణి కాదు వాడి బాబు అర్జునుణ్ణి రా అంటూ ఆదర్శ్ చెప్పే డైలాగ్‌తో టీజర్ సాగుతుంది. ఈ టీజర్ చూస్తుంటే కోర్ట్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. టీజర్‌లో నటుడు ఆదర్శ్‌ను క్రిమినల్‌గా, రాజా రవీంద్ర, లాయర్ శ్రీకాంత్ అయ్యంగార్, పోలీస్ ఆఫీసర్ ఇలా ముగ్గురూ కలిసి నటుడు ఆదర్శన్‌ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం : గోపీసుందర్, కెమెరా: వెంకట్ హనుమ నరిసేటి.
