Skip to main content

Namaste NRI

అద్బుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న గీతా సాక్షిగా టీజర్

ఆదర్శ్‌,  చిత్రా శుక్లా జంటగా ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గీత సాక్షిగా. పుష్పక్‌, జేబీహెచ్‌ఆర్‌ఎన్‌కేఎల్‌ సమ్పరణలో చేతన్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై చేతన్‌ రాజ్‌ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో అద్భుతమైన టీజర్‌ని విడుదల చేశారు. పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుణ్ణి కాదు వాడి బాబు అర్జునుణ్ణి రా అంటూ ఆదర్శ్‌ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ సాగుతుంది. ఈ టీజర్‌ చూస్తుంటే కోర్ట్‌ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. టీజర్‌లో నటుడు ఆదర్శ్‌ను క్రిమినల్‌గా, రాజా రవీంద్ర, లాయర్‌ శ్రీకాంత్‌ అయ్యంగార్‌, పోలీస్‌ ఆఫీసర్‌ ఇలా ముగ్గురూ కలిసి నటుడు ఆదర్శన్‌ను టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి అని యూనిట్‌ పేర్కొంది.  ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం : గోపీసుందర్‌, కెమెరా: వెంకట్‌ హనుమ నరిసేటి.

Social Share Spread Message

Latest News