Namaste NRI

గీత వచ్చేది ఆరోజే

హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రలో విశ్వ తెరకెక్కించిన చిత్రం గీత. మ్యూట్‌ విట్నెస్‌ అన్నది ఉపశీర్షిక. ఆర్‌ రాచయ్య నిర్మాత. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన దర్శకుడు వినాయక్‌ ఇప్పించారు. ఆయనకు నేనెప్పటికీ రుణపడి ఉంటా. ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా కనిపించనుంది అన్నారు. నిర్మాత ఆర్‌.రాచయ్య మాట్లాడుతూ గురువుకు తగ్గ విష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్‌ విశ్వ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అని చెప్పారు. ఈ చిత్రంలో సునీల్‌ కీలక పాత్రలో నటించారు. కిరణ్‌ విలన్‌గా నటించారు. ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది.ఈ చిత్రానికి సంగీతం సుభాష్‌ ఆనంద్‌,  ఛాయాగ్రహణం: క్రాంతికుమార్‌.కె.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events