Namaste NRI

బ్రిటన్‌లో గెరిట్‌ బీభత్సం

బ్రిటన్‌ లో గెరిట్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను కారణంగా తీవ్రమైన గాలులు వీస్తున్నాయి. గాలుల ధాటికి ల్యాండ్‌ అవుతున్న ఓ విమానం కుదుపులకు గురైంది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 777  ఫ్లైట్‌ 134 లాస్‌ ఏంజెల్స్‌ నుంచి లండన్‌కు బయల్దేరింది. అయితే లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో భారీగా గాలులు వీచాయి. దీంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ఈ ఘటనతో ప్రయాణికులు, సిబ్బంది, విమానాశ్రయ అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, విమానం సేఫ్‌గా ల్యాండ్‌ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

గెరిట్ తుఫాను కారణంగా బ్రిటన్ అతలాకుతలమైంది. తుఫాను ప్రభావంతో 70 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడు తోంది. దీంతో బ్రిటన్‌కు రాకపోకలు సాగించే పలు విమానాలు, రైళ్లు ఆసల్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని అధికారులు రద్దు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events