విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఇండియన్ టూరిస్ట్‌ల కోసం వినూత్న ఆఫర్ తీసుకువచ్చింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ క్రమంలో ఇండియన్ ట్రావెలర్స్ కోసం శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ బై వన్ గెట్ వన్ ఆఫర్ తీసుకువచ్చినట్లు తెలిపింది. అంటే ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా పొందొచ్చు. అంటే ఒకవైపు ప్రయాణానికి టికెట్ కొంటే రిటర్న్ జర్నీకి ఉచితంగా టికెట్ లభిస్తుంది. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. కొలంబో నుంచి రిటర్న్ టికెట్ ఉచితంగా లభిస్తుంది. కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకోవాలని శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. రెండు డోసులు పూర్తయ్యి ఉండాలంది. రెండో డోస్ వేయించుకొని 14 రోజులు పూర్తవ్వాలి. ఇలాంటి వారే శ్రీలంక వెళ్లడానికి అర్హులు లేదంటే జర్నీ చేయడానికి అవకాశం లేదు.