భారతీయ నిపుణులకు శుభవార్త. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియలో జ్యాపాన్ని నివారించాలని కోరుకుంటున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. అత్యంత నిపుణులైన భారతీయ టెకీలు హెచ్ 1 బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వస్తారు. ఒక్కో దేశానికి 7 వేల చొప్పున గ్రీన్‌కార్డులు జారీ చేస్తున్న ప్రస్తుత అమెరికా వలస విధానంతో వీరు ఎంతగానో ఇబ్బంది పడతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ గ్రీన్‌కార్డుల అంశంపై దృష్టి సారించారు. గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియలో ఆలస్యాన్ని పరిష్కరించాలని అధ్యక్షుడు కోరుకుంటున్నారు అని శ్వేతసౌధం కార్యదర్శి జెన్ సాకీ తెలిపారు.














