టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. యూఎస్‌ఏలో ఉన్న మహేశ్ బాబు అభిమానులకు శుభవార్త బయటకు వచ్చింది. యూఎస్‌లో గుంటూరు అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. డల్లాస్‌తోపాటు పలు ఇతర లొకేషన్లలో బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఫ్యాన్స్ ఇప్పటికే పోటీ పడి మరి ముందే టికెట్ బుక్ చేసుకునే పనిలో బిజీ అయిపోయారు. గుంటూరు కారం తమిళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను పాపులర్ బ్యానర్ శ్రీ లక్ష్మి మూవీస్ దక్కించుకుంది. గుంటూరు కారంను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు.