Namaste NRI

సంగీత ప్రియులకు ఓ శుభవార్త

హైదరాబాద్ సంగీత ప్రియులకు ఓ శుభవార్త. ఇండియాలోని గొప్ప సంగీత విధ్వాంసులలో ఇళయరాజా ఒకరు. ఆయన పాటలతో పరవశించిన మ్యూజిక్ ప్రియులు ఎందరో. ఇళయరాజా 80వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లో ఓ భారీ సంగీత విభావరికి రంగం సిద్ధమైంది. మ్యూజిక్ మాస్ట్రో ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో గచ్చిబౌళి స్టేడియంలో లైవ్ కన్సర్ట్ ఇవ్వనున్నారు. దాదాపు వంద మంది సంగీత విధ్వాంసులతో ఈ వేదికపై కచేరి ఉండనుంది. ఈ ఈవెంట్ను వీక్షించాడినికి దాదాపు ఇరవై వేల మందికి పైగా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ టాకీస్ ఈ ఈవెంట్ను నిర్వహించనుంది.  దీనిపై ఇళయరాజా చాలా కాలం తర్వాత తిరిగి స్టేజిపైకి రానుండటం, కచేరితో అభిమానులతో కనెక్ట్ కానుండడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. మరుపురాని ప్రదర్శనలు, జ్ఞాపకాలను ఆ రోజు మీ అందరితో పంచుకోవడానికి వేచి చూస్తున్నట్లు వెల్లడించాడు. ఇళయరాజా కాన్సెర్ట్ను వీక్షించడానికి ఇన్సైడర్ ఇన్‌సైడర్‌ (https://insider.in/)లో టిక్కెట్స్‌ను  బుక్ చేసుకోండి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress