కింగ్డమ్కు వచ్చే బ్రిటన్, ఐర్లాండ్ పౌరులకు సౌదీ అరేబియా శుభవార్త అందించింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రెండు దేశాల జాతీయులకు రాజ్యంలోకి ప్రవేశించడానికి ఎలక్ట్రానిక్ వీసా మినహాయింపు ని ప్రారంభించింది. సౌదీ తీసుకున్న నిర్ణయం కారణంగా బ్రిటీష్ జాతీయులందరూ ఇకపై ప్రయాణానికి ముందు ప్రత్యేకంగా విజిట్ వీసా పొందాల్సి అవసరం లేదు. అలాగే సింగ్ ఎంట్రీ ద్వారా ఇరు దేశాల పౌరులు సౌదీలో 6 నెలల వరకు బస చేసేందుకు వీలు కల్పించింది. బిజినెస్, పర్యాటకం, రిసెర్చ్, వైద్య ప్రయోజనాల కోసం కింగ్డమ్ను సందర్శించే రెండు దేశాలవారికి ఈ మినహాయింపు వర్తిస్తుందని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.దీనికోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫారమ్ ద్వారా దరఖాస్తు చేస్తే సరిపోతుందని సంబంధిత అధికారులు తెలిపారు.