యాపిల్ వాచ్లో రీడింగ్ వల్ల తను గర్భవతి అని ఒక యువతికి తెలిసింది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో వెలుగు చూసిందీ ఘటన. స్థానికంగా నివశించే ఒక 34 ఏళ్ల యువతికి యాపిల్ వాచ్ పెట్టుకొని పడుకోవడం అలవాటు. అలా చేస్తుంటే.. ఒక రోజు ఆమెకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆమె నిద్రపోతున్న సమయంలో కూడా హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటోందని ఆ నోటిఫికేషన్లో ఉంది. దీన్ని ఆమె వివరిస్తూ ‘అంతకుముందు నేను నిద్రపోయేటప్పుడు హార్ట్ రేట్ 57గా ఉండేది. కానీ అది 72కు పెరిగిందని యాపిల్ వాచ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది చిన్న మార్పే కానీ ఇలా గత 15 రోజులుగా జరుగుతోందని ఆ నోటిఫికేషన్లో ఉంది’.దీంతో అనుమానం వచ్చి పరీక్షలు చేస్తే తను గర్భవతి అని తెలిసిందని, తన కన్నా ముందే యాపిల్ వాచ్కు ఈ వార్త తెలిసిపోయిందని ఆమె పేర్కొంది. ఒకవేళ ఈ వాచ్ లేకపోతే తనకు అసలు అనుమానవే వచ్చేది కాదని ఆమె తెలిపింది.
కాగా, కొత్తగా యాపిల్ కంపెనీ విడుదల యాపిల్ వాచ్లలో సరికొత్త ఫీచర్లను ఆ కంపెనీ తీసుకొచ్చింది. ముఖ్యంగా యూజర్ల ఆరోగ్యంపై ఈసారి యాపిల్ కంపెనీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే హార్ట్ రేట్ మానిటర్. టెంపరేచర్ సెన్సర్ వంటి వాటిని ఈ వాచ్లలో పొందుపరిచిన సంగతి తెలిసిందే.