ప్రణవ్ సింగంపల్లి, షగ్న శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల. శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో భువన్ రెడ్డి కొవ్వూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో బుల్లితెర, వెండితెర హీరో సాగర్ చేతుల మీదుగా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి పాటలు: శ్రీ సాయికిరణ్, ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్, సంగీతం: కార్తీక్ రోడ్రిగ్యెజ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: కమరన్, డీఓపీ: నిఖిల్ సురేంద్రన్, సౌండ్ డిజైన్: జె.ఆర్. యతిరాజ్, ఆడియోగ్రఫీ:షామల్ సిక్దర్, కలరిస్ట్: రాజ శ్రీనివాస్ మామిడి, సింగర్స్: మంగ్లీ, చిన్మయ్ శ్రీపాద, విజయ్ ఏసుదాస్, పీఆర్వో: సురేష్ కొండేటి, నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనాథ్ పులకురం.