Skip to main content

Namaste NRI

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఫస్ట్‌లుక్‌ అండ్ గ్లింప్స్‌

ప్రణవ్‌ సింగంపల్లి,  షగ్న శ్రీ వేణున్‌ జంటగా  నటిస్తున్న సినిమా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల.  శ్రీనాథ్‌ పులకురం దర్శకత్వంలో భువన్‌ రెడ్డి కొవ్వూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో బుల్లితెర, వెండితెర హీరో సాగర్‌ చేతుల మీదుగా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ  చిత్రంలో, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు.

 ఈ చిత్రానికి పాటలు: శ్రీ సాయికిరణ్‌, ఎడిటర్‌: కోదాటి పవన్‌ కల్యాణ్‌, సంగీతం: కార్తీక్‌ రోడ్రిగ్యెజ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్: కమరన్‌, డీఓపీ: నిఖిల్‌ సురేంద్రన్‌, సౌండ్‌ డిజైన్‌: జె.ఆర్‌. యతిరాజ్‌, ఆడియోగ్రఫీ:షామల్ సిక్దర్, కలరిస్ట్‌: రాజ శ్రీనివాస్‌ మామిడి, సింగర్స్‌: మంగ్లీ, చిన్మయ్‌ శ్రీపాద, విజయ్‌ ఏసుదాస్‌, పీఆర్వో: సురేష్‌ కొండేటి, నిర్మాత: భువన్‌ రెడ్డి కొవ్వూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనాథ్‌ పులకురం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events