అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫ్లోరిడాలోని ట్రంప్ స్వగృహం మార్ ఎ లాగో లో నిర్వహించిన ఈ వేడుకల్లో పలు భారతీయ సంఘాల ప్రతినిధులు, రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతినిధులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన రిపబ్లికన్ హిందూ సమాఖ్య వ్యవస్థాపకుడు షల్లీ కుమార్, తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమున, విక్రమ్ కుమార్, హరిభాయ్ పటేల్‌ను ట్రంప్ ప్రత్యేకంగా అభినందించారు.














