Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ స్వగృహంలో ఘనంగా దీపావళి వేడుకలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌ స్వగృహం మార్‌ ఎ లాగో లో నిర్వహించిన ఈ వేడుకల్లో పలు భారతీయ సంఘాల ప్రతినిధులు, రిపబ్లికన్‌ హిందూ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రంప్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతినిధులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన రిపబ్లికన్‌ హిందూ సమాఖ్య వ్యవస్థాపకుడు షల్లీ కుమార్‌, తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమున, విక్రమ్‌ కుమార్‌, హరిభాయ్‌ పటేల్‌ను ట్రంప్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Social Share Spread Message

Latest News