
వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ-2 విడుదలకు మార్గం సుగమమైంది. ఈ సినిమాపై విధించిన స్టేను కేరళ హైకోర్టు ఎత్తివేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేసింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయని, కేంద్ర సెన్సార్ బోర్డు చిత్రాన్ని పునఃపరిశీలించాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ చిత్ర బృందం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితం వచ్చిన ది కేరళ స్టోరీకి సీక్వెల్ ఇది.















