Namaste NRI

హన్సిక 105 మినిట్స్ ట్రైలర్ లాంచ్

హన్సిక ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 105 మినిట్స్‌. రాజు దుస్సా దర్శకుడు. రుద్రాన్ష్‌ సెల్యులాయిడ్స్‌, మాంక్‌ ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బొమ్మక్‌ శివ నిర్మాత. ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. తన పాత్ర వేషధారణలోనే హన్సిక ట్రైలర్‌ను విడుదల చేయడం వినూత్నంగా తోచింది. హన్సిక మాట్లాడుతూ ఒకే క్యారెక్టర్‌ని ఒకే షాట్‌లో చిత్రీకరించిన తొలి ప్రయోగాత్మక చిత్రమిది. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ 34 నిమిషాల షాట్‌ను సింగిల్‌ టేక్‌లో చేయడం నాకు కొత్త అనుభవాన్ని, అనుభూతిని పంచింది. 8 రోజుల రిహార్సల్స్‌ చేసిన తర్వాత షూటింగ్‌కి వెళ్లాం అని చెప్పింది. ప్రస్తుతానికి ఒక్క తెలుగు వెర్షన్‌లోనే మేకర్స్‌ చేయనున్నారు. తర్వాత వివిధ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేసే ఆలోచనతో ఉన్నారు. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిశోర్‌ బోయిదాపు, సంగీతం: సామ్‌ సీఎస్‌, నిర్మాత: బొమ్మక్‌ శివ, దర్శకత్వం: రాజు దుస్సా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events