తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హను-మాన్. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్యరాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ.సర్టిఫికెట్ లభించింది. అంజనాద్రి అనే ఊహత్మక ప్రపంచంలో నడిచే కథ ఇది. సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది.
వీఎఫ్‌ఎక్స్ విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. అపర పరాక్రమవంతుడైన హనుమాన్ లీలలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఈ సినిమా కంటెంట్ మెస్మరైజింగ్‌గా ఉందని సెన్సార్ వారు కూడా అభినందిం చారు అని చిత్రబృందం పేర్కొంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: గౌరహరి, అనుదీప్‌దేవ్, కృష్ణసౌరబ్, స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్‌విల్లే, నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్, రచన-దర్శకత్వం: ప్రశాంత్‌వర్మ.