Namaste NRI

హనుమాన్‌ గర్వంగా చెప్పుకునే సినిమా : ప్రశాంత్‌ వర్మ

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వస్తున్న ఫస్ట్‌ ఇండియన్‌ ఒరిజినల్‌ సూపర్‌ హీరో మూవీ హనుమాన్‌. తేజ సజ్జా కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్‌ లెవల్‌లో క్రేజ్‌ సంపా దించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చైతన్య సమర్పిస్తున్నారు. నేడు విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను ప్రశాంత్‌ వర్మ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హనుమాన్‌ కోసం తేజను మేకోవర్‌ చేయించాను. జాంబిరెడ్డి లో సిటీ బాయ్‌లా, ఇందులో పల్లె టూరి కుర్రాడిలా చూపించాం. సినిమాల్లో తేజకు ఇంకా మాస్‌ ఇమేజ్‌ రాలేదు. ఈ మూవీలోని పాత్రకు తేజనే కరెక్ట్‌ అనుకున్నాం. సూపర్‌ హీరో ఫిల్మ్‌ టెంప్లేట్‌లోనే ఉంటుందీ మూవీ. బ్యాట్‌మెన్ లాంటి సినిమాను రాజ మౌళిగారు చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అదే తరహాలో ఉంటుంది. కేజీఎఫ్‌ లో యష్‌ని చూపించి నట్లే నేను హనుమంతుడిని చూపించబోతున్నాను. హనుమాన్‌ విజయం సాధిస్తే పదేళ్లపాటు గర్వంగా చెప్పుకొనే సినిమాల ప్రణాళిక ఉంది అని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events