Namaste NRI

హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్.. కొత్త సినిమా రాకా ఫస్ట్ లుక్ రిలీజ్

అల్లు అర్జున్‌-అట్లీ సినిమా మొదలై ఏడాదికావొస్తున్నది. అరవైశాతానికిపైగా షూటింగ్‌ కూడా పూర్తయింది. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ విషయంలో మేకర్స్‌ చాలా గోప్యంగా ఉన్నారు. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించుతూ అల్లు అర్జున్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని షాకింగ్‌ లుక్‌తో కూడిన టైటిల్‌ను రివీల్‌ చేశారు. ఈ భారీ పాన్‌ ఇండియా చిత్రానికి రాకా అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిత్రబృందం పేర్కొన్నది. గుండుతో కనిపిస్తూ మనిషి, మృగాన్ని పోలిన లుక్‌లో బన్నీ అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. రాకా అంటే పౌర్ణమి అనే అర్థంలో కూడా కొందరు టైటిల్‌పై విశ్లేషణ చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. అందులో ఒకటి నెగెటివ్‌ షేడ్స్‌తో ఉంటుందని తెలిసింది. తాజా ఫస్ట్‌లుక్‌ నెగెటివ్‌ షేడ్‌ క్యారెక్టర్‌కు సంబంధించినదని, మరో పాత్ర తాలూకు లుక్‌ను త్వరలో రివీల్‌ చేస్తారని అంటున్నారు.

ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఉద్దేశించి ఇది కేవలం ఆరంభం మాత్రమే,మీ అందరి ఊహలకు మించి ఈ సినిమా ఉంటుంది. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అంటూ చిత్రబృందం పెట్టిన క్యాప్షన్స్‌ అందరిని ఆకర్షిస్తున్నాయి. హాలీవుడ్‌కు ధీటైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో, భారీ సాంకేతిక హంగులతో వెండితెరపై ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ దర్శకుడు అట్లీ ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారని మేకర్స్‌ అంటున్నారు. పునర్జన్మల నేపథ్యంలో సాగే సైన్స్‌ ఫిక్షన్‌ కథ ఇదని, భారతీయ పురాణాల ప్రస్తావన కూడా ఉంటుందని సమాచారం. దీపికా పడుకోన్‌ ఈ సినిమాలో కథానాయిక. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events