పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరి హర వీర మల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం. ఈ సినిమా మూడొంతులు షూటింగ్ పూర్తిచేసుకోగా, మిగతా షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ పనులను క్రిష్ పర్యవేక్షణలో దర్శకుడు జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కోసం ప్రత్యేకంగా 17వ శతాబ్దం నాటి చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్లను అంతర్జాతీయ నిర్మాణ విలువలతో రాజీ లేకుండా నిర్మించారు. ఈ సినిమాకు దర్శకుడు మారినట్టే, ఇప్పుడు డీవోపీ కూడా మారాడు. ఇప్పటివరకూ జ్ఞానశేఖర్ వి.ఎస్ ఛాయాగ్రహణం అందించగా, ఆయన స్థానంగా ఇప్పుడు మనోజ్ పరమహంస వచ్చి చేరారు. మిగతా షూటింగ్‌ను త్వరితగతిన పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ లొకేషన్లు వెతికే పనిలో పడింది.

మరోవైపు ఇప్పటివరకూ జరిగిన షూటింగ్‌కు సంబంధిచిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతు న్నది. ఈ ఏడాది చివరికల్లా హరిహర వీరమల్లు పార్ట్1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ను విడుదల చేయడానికి టీమ్ సిద్ధమయింది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీడియోల్, సునీల్, నోరా ఫతేహి కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: ఎ.దయాకర్‌రావు, సమర్పణ: ఏ.ఏం.రత్నం.
