
డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. పార్టీలో ఆమెకు రోజురోజుకూ మద్దతు పెరుగుతుండగా ట్రంప్‌తో పోటీ విషయంలోనూ దూసుకెళ్తున్నారు. బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో రిపబ్లికన్ పార్టీకి, డెమోక్రటిక్ పార్టీకి 6 శాతం ఓట్ల తేడా ఉండగా ఇప్పుడది 1 శాతానికి తగ్గిపోయింది. న్యూయార్క్ టైమ్స్, సియానా కళాశాల సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. బైడెన్ వైదొలగాక నిర్వహిం చిన ఈ సర్వే విడుదలైంది. తాజా పోల్‌లో అమెరికాలో ఓటర్లలో 48 శాతం మంది ట్రంప్‌నకు మద్దతివ్వగా హారిస్‌కు 47 శాతం మంది అండగా నిలిచారు. అంటే కేవలం 1 శాతం తేడాయే ఇద్దరి మధ్య ఉంది.
