Namaste NRI

అనంత్ అంబానీ పెళ్లీ కార్డు చూశారా? ఎన్నో ప్రత్యేకతలో తెలుసా!

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న విషయం తెలిసిందే. ముకేశ్‌ – నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ  వివాహం జులై 12న రాధికా మర్చంట్‌ తో జరగనుంది. ఈ నేపథ్యంలో అంబానీ ఇంట ఐదు నెలల కిందటే పెళ్లి వేడుకలు మొదల య్యాయి. లగ్నపత్రిక, ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ అంటూ ఈ ఏడాది ఆరంభం నుంచి ఆ ఇంట పండగ వాతావరణం నెలకొంది.  పెళ్లికి మరో 14 రోజులు మాత్రమే ఉండటంతో అంబానీ కుటుంబం అందరికీ ఆహ్వానాలు పంపుతోంది. పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలకు ముకేశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీ, నీతా అంబానీలు స్వయంగా వెళ్లి వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ కార్డులను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంత్‌ – రాధిక వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అంబానీ రేంజ్‌కు తగ్గట్టే పెళ్లి పత్రికను డిజైన్‌ చేయించారు.

ముకేశ్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జూలై 12న జరుగనున్న విషయం తెలిసిందే. ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జియో వరల్డ్‌ ప్లాజా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహ తంతు జులై 12న (శుక్రవారం) మొదలై,  జులై 14న (ఆదివారం) మంగళ ఉత్సవ్‌ (రిసెప్షన్‌)తో ముగియనుంది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ ప్రముఖు లు, రాజకీయ నాయకులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events