ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయూష్ కథానాయకుడిగా పరిచయవుతూ నటించిన తొలి చిత్రం దక్ష. శ్రీఅన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. తల్లాడ సాయికృష్ణ నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వినాయక చవితి సందర్భంగా ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా వుంటుంది అన్నారు. ఆయుష్ తో పాటు అను, నక్షత్ర, రియా, అఖిల్, రవిరెడ్డి, పవన్‌లు ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం : శేఖర్