Skip to main content

Namaste NRI

దక్ష ఫస్ట్ లుక్ చూశారా?

ప్రముఖ సీనియర్‌ నటుడు శరత్‌ బాబు తనయుడు ఆయూష్‌ కథానాయకుడిగా పరిచయవుతూ నటించిన తొలి చిత్రం దక్ష. శ్రీఅన్నపూర్ణ క్రియేషన్స్‌ పతాకంపై వివేకానంద విక్రాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తల్లాడ సాయికృష్ణ నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను వినాయక చవితి సందర్భంగా ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్‌  విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా వుంటుంది అన్నారు.  ఆయుష్‌ తో పాటు అను, నక్షత్ర, రియా, అఖిల్‌, రవిరెడ్డి, పవన్‌లు ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం : శేఖర్‌

Social Share Spread Message

Latest News