దివంగత సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కర్మ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ నాన్న గారు నాకు అందించిన అతి పెద్ద బహుమతి మీ అభిమానం. ఆయన ఎక్కడికి వెళ్లిపోలేదు. మన మధ్యే ఉన్నారు. నాన్న గారు మన గుండెల్లో చిరకాలం ఉంటారు. నాతోనే ఉండి నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తారు. మీ అభిమానం ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. ఆది శేషగిరి రావు మాట్లాడుతూ నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా అని అన్నయ్య సినిమాలో పాట ఉంటుంది. ఆయన అలాగే జీవించారు. సంతోషంగా వెళ్లిపోయారు. మీలాంటి లక్షలాది మంది అభిమానం ఆయన సొంతం చేసుకున్నారు అన్నారు.














