పిల్లల లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించిన హంగేరీ అధ్యక్షురాలు కేటలిన్ నోవక్ తన పదవికి రాజీనామా చేశారు. క్షమాభిక్ష విషయంలో తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని, అందు కే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఓ చిల్డ్రన్ హోం నిర్వాహకులు పిల్లలను లైంగికంగా వేధిస్తున్న విష యాన్ని కప్పిపుచ్చిన ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ను కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించింది. అయితే ఆ వ్యక్తికి అధ్యక్షురాలు కేటలిన్ క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో ప్రజలతోపాటు రాజకీయ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా అధ్యక్షురాలి భవనం ముందే నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నానంటూ కేటలిన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.