అమెరికాలో ఇడా హరికేన్ విధ్వంసం కొనసాగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్, మేరీలాండ్, పెన్సిల్వేనియా, వర్జీనియా, కనెక్టికట్ రాష్ట్రాల్లో టోర్నడోలు, ప్రచండ గాలులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. భారీ స్థాయిలో ఎడతెగని వర్షాలు కురుస్తుండడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. వేర్వేరు చోట్ల నీట మునిగి ఇప్పటి వరకూ 46 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో న్యూజెర్సీ నుంచి 23 మంది, న్యూయార్క్ నుంచి 13 మంది ఉన్నారు. కనెక్టికట్‌లో ఓ పోలీస్ అధికారి కార్టు కొట్టుకుపోవడంతో మరణించారు. పెన్సిల్వేనియాలో ఓ వ్యక్తి కొట్టుకుపోతున్న తన కారు నుంచి భార్యను కాపాడినా తాను మాత్రం ప్రాణాలు దక్కించుకోలేకపోయాడు. పలు చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో బయటపడే మార్గం లేక శవాలుగా మిలిలారు. వారు సాయం కోసం ఆర్థిస్తూ కళ్లముందే మునిగిపోతున్నా తాము కాపాడలేకపోయామంటూ వారి సన్నిహితులు కన్నీటి పర్వంతమయ్యాయి. చాలా చోట్ల ప్రజలు తమ నివాసాలను విడిచి వెళ్లిపోయారు. ఎంతో మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలిస్తేనే మృతుల సంఖ్యపై సృష్టత వచ్చే అవకాశం ఉంది. న్యూయార్క్‌లో రహదారులపై సుమారు 500 వాహనాలు వరదలో చిక్కుకుపోయాయి. చెత్తాంతా రహదారులపై నిండిపోయింది.
న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఈశన్య రాష్ట్రాల్లోని తెలుగు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ముఖ్యంగా న్యూజెర్సీలోని మిడిల్‌సెక్స్, గ్లోసస్టర్, సోమర్‌సెట్ వంటి కౌంటీల్లోని వివిధ నగరాల్లో స్థిరపడిన కొందరి తెలుగువారు ఇళ్ల బేస్‌మెంట్లలోకి నీళ్లు వచ్చేశాయని, టోర్నోడో ప్రభావంతో పైకప్పులు దెబ్బతిని వాన నీరు ఇళ్లలోకి వచ్చిందని ప్రిన్స్‌స్టన్‌లో స్థిరపడిన వాసిరెడ్డి రామకృష్ణ తెలిపారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదట పడుతోంది. చాలా రహదారుల్ని రాకపోకలకు తెరిచారు. నదులు, కాలువలకు సమీపంలో ఉన్న 20`30 శాతం రోడ్లు మాత్రం ఇంకా మూనేసి ఉన్నాయి అని తెలిపారు. బేస్‌మెంట్ ఒకట్రెండు గదులు, లివింగ్ రూం, హోం థియేటర్ వంటివి ఏర్పాటు చేసుకుంటారు. భారీగా చేరిన నీతితో అవి దెబ్బతిన్నాయి అని ఈస్ట్‌బ్రూన్స్‌విక్‌లో నివసించే తానా న్యూజెర్సీ ప్రతినిధి వంశీ తెలిపారు. భారీ వర్షాలకు న్యూయార్క్‌లోనూ రోడ్లన్నీ మూసి వేశారు. సబ్‌వేల్లో ఇప్పటికీ నీరుంది అని న్యూయార్క్‌లోని బుచ్చి రాంప్రసాద్ తెలిపారు. న్యూయార్క్‌లో 8`9 గంటల పాటు ఏకధాటిగా వర్షం పడిరది అని ఆయన పేర్కొన్నారు. బేస్‌మెంట్‌లోని గదుల్లో నేల నుంచి చలి ఎక్కువ రావడం కచ్చితంగా కార్పెట్‌లు వేస్తారు. వర్ష నీటికి దెబ్బతిన్నాయి. మళ్లీ కొత్త కార్పేట్ వేసుకోవడానికి 25`30 వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది అన్నారు.