విజయ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వారసుడు. విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీస్ పరమ్ వి.పొట్లూరి, పెరల్ వి.పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఇట్స్ ఫర్ యూ అమ్మ అనే మూడో సింగిల్‌ను యూనిట్ విడుదల చేసింది. ఈ పాట వారసుడు సోల్, కథకు కీలకమైన అమ్మ సెంటిమెంట్‌ను తెలియజేస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాటతో వారసుడు వంశీ పైడిపల్లి స్టైల్‌లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ తెలిపారు. ప్రభు, శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త కీలకపాత్రల్లో నటిస్తున్నారు.