పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మరింత ముదురుతున్నదని, మూడో ప్రపంచ యుద్ధం సంభవించే ప్రమాదముందని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్, ఇజ్రాయెల్ బలగాల మధ్య భీకరపోరు మొదలైన కొన్ని గంటల్లోనే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కొనటంలో అమెరికా విధానంపై ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరి కా అధ్యక్షుడు జో బైడెన్ కాలిఫోర్నియా బీచ్‌లో హాయిగా నిద్రపోతున్నాడని మండిపడ్డారు. అమెరికా నేతలు నిద్రమత్తులో ఉన్నారని, అందువల్లే మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.