అగ్ర హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమాల విశేషాలను అభిమానులతో పంచుకోవడంతో పాటు సోషల్ ఇష్యూస్ మీద కూడా స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో మైలురాయిని చేరుకున్నారు. ఈ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఆయన్ని అనుసరించే అభిమానుల సంఖ్య 21 మిలియన్స్‌కు చేరుకుంది. విజయ్ దేవరకొండ ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా వ్యక్తపరచడం, రాజీలేని వ్యక్తిత్వం ఆయనకు తిరుగులేని అభిమాన గణాన్ని తెచ్చిపెట్టాయి. తెలుగుతో పాటు ఇతర రాష్ర్టాల్లో కూడా విజయ్ దేవరకొండకు అభిమానులున్నారు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ తర్వాత తెలుగులో ఆ స్థాయిలో ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న హీరోగా విజయ్ దేవరకొండ నిలిచారు.