Skip to main content

Namaste NRI

ఇన్ స్టాగ్రామ్ లో 21 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ చేరుకున్న హీరో

అగ్ర హీరో విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమాల విశేషాలను అభిమానులతో పంచుకోవడంతో పాటు సోషల్‌ ఇష్యూస్‌ మీద కూడా స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో మైలురాయిని చేరుకున్నారు. ఈ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఆయన్ని అనుసరించే అభిమానుల సంఖ్య 21 మిలియన్స్‌కు చేరుకుంది.  విజయ్‌ దేవరకొండ  ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా వ్యక్తపరచడం, రాజీలేని వ్యక్తిత్వం ఆయనకు తిరుగులేని అభిమాన గణాన్ని తెచ్చిపెట్టాయి. తెలుగుతో పాటు ఇతర రాష్ర్టాల్లో కూడా విజయ్‌ దేవరకొండకు అభిమానులున్నారు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ స్టార్‌ చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్‌ తర్వాత తెలుగులో ఆ స్థాయిలో ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న హీరోగా  విజయ్‌ దేవరకొండ నిలిచారు.

Social Share Spread Message

Latest News