Namaste NRI

ఏకంగా ఇజ్రాయెల్​ ప్రధానిని టార్గెట్​ చేసిన హెజ్‌బొల్లా

ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెతాన్య‌హూ ఇంటిపై డ్రోన్ దాడి జ‌రిగింది. సిసేరియా ప‌ట్ట‌ణంలో ఉన్న ఆయ‌న నివాసంపై డ్రోన్‌తో అటాక్ చేశారు. హ‌మాస్ నేత య‌హ్యా సిన్వార్ హ‌త్య త‌ర్వాత ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. డ్రోన్ దాడి జ‌రిగిన స‌మ‌యంలో ఆ స‌మీపంలో నెతాన్య‌హూ లేర‌ని ఆయ‌న ప్ర‌తినిధి తెలిపారు. నెతాన్య‌హూ ఇంటిపై జ‌రిగిన దాడిలో ఎవ‌రికీ ఎటువంటి ప్రమాదం లేద‌న్నారు. లెబ‌నాన్ నుంచి డ్రోన్‌ను లాంచ్ చేసి ఉంటార‌ని ఇజ్రాయిల్ మిలిట‌రీ అంచ‌నా వేస్తున్న‌ది. అయితే ఓ డ్రోన్ ఓ బిల్డింగ్‌ను ఢీకొట్టింద‌ని, ఆ త‌ర్వాత మ‌రో రెండు డ్రోన్ల‌ను ఇజ్రాయిల్ భూభాగంలోకి పంపిన‌ట్లు తెలిపారు. డ్రోన్ దాడి తామే చేసిన‌ట్లు ఇంకా హిజ్‌బొల్లా ప్ర‌క‌టించ‌లేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events