నాని హీరో నటిస్తున్న చిత్రం హిట్: ది థర్డ్ కేస్. దర్శకుడు శైలేష్ కొలను. ప్రశాంతి తిపిర్నేని, నాని కలిసి నిర్మిస్తున్నారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని వైజాగ్‌లో అభిమానుల సమక్షంలో మేకర్స్ విడుదల చేశారు. నాని ఇందులో అర్జున్ సర్కార్‌గా నటించారు. ఆ పాత్రను పరిచయం చేస్తూ ట్రైలర్ మొదలైంది. క్రిమినల్స్ ఉంటే భూమ్మీద 10 ఫీట్ సెల్‌లో వుండాలి. లేదా, భూమిలో 6 ఫీట్ హోల్‌లో వుండాలి అంటూ అర్జున్ సర్కార్‌గా నాని చెప్పిన డైలాగ్ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తున్నది.

ఓ పాప కిడ్నాప్ కేసు బాధ్యతను అర్జున్ సర్కార్ తీసుకోవడం, నేరస్థుల ప్రపంచంలోకి వెళ్లి కనికరం లేకుండా వేటాడటం, న్యాయం కోసం వాళ్లను అత్యంత హింసాత్మకంగా చంపటం ఈ ట్రైలర్‌లో చూడొచ్చు. ఉద్రేకపూరితమైన పాత్రలో అద్భుతంగా నానీని ప్రజెంట్ చేశారు దర్శకుడు శైలేష్ కొలను. మే 1న రాబోతున్న ఈ క్రైమ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఆడియన్స్‌ని తప్పకుండా ఆకట్టుకుంటుందని నాని నమ్మకం వ్యక్తం చేశారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె.మేయర్.
