
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం గం.. గం.. గణేశా. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక కథానాయికలు. ఉదయ్‌శెట్టి దర్శకత్వం. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సక్సెస్‌మీట్‌లో ఆనంద్‌దేవరకొండ మాట్లాడారు. గం గం గణేశా సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో సరైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు రాలేదు. గం గం గణేశా ఆ లోటు తీర్చేసింది. తెలుగు రాష్ర్టాలే కాక, కర్ణాటకలో కూడా రెస్పాన్స్ బావుంది అన్నారు. ఈ సినిమా స్క్రీన్‌ప్లేని అందరూ మెచ్చుకుంటున్నారని, థియేటర్లలో విజిల్స్, క్లాప్స్ వినిపిస్తున్నాయని, వెన్నెల కిశోర్ చేసిన ఆర్గాన్ డేవిడ్ పాత్రకు హిలేరియస్ రెస్పాన్స్ వస్తున్నదని దర్శకుడు చెప్పారు. ఇంకా నిర్మాతలతోపాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
