ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంలో రూపొందిన వెబ్‌సిరీస్ హోం టౌన్. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ప్రధానపాత్రధారులు. శ్రీకాంత్‌రెడ్డి పల్లే దర్శకుడు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మాతలు. రేపటి నుంచి ఈ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ స్పెషల్ ప్రివ్యూను హైదరాబాద్‌లో ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ మాట్లాడారు.

ఈ సిరీస్ ఓ జ్ఞాపకాల దొంతర అని, ఇందులోని పిల్లల అల్లరి చూస్తుంటే ఓ 35ఏళ్లు వెనక్కు వెళ్లిపోయానని, టెక్నికల్‌గా మంచి క్వాలిటీతో రూపొందిన సిరీస్ ఇదని రాజీవ్‌కనకాల పేర్కొన్నారు. 90s ఎ మిడిల్‌క్లాస్ బయోపిక్ తర్వాత తమ సంస్థ నుంచి వస్తున్న సిరీస్ ఇదని, దేవ్ దీప్ గాంధీ కుండు కెమెరా, సురేశ్ బొబ్బిలి సంగీతం ఈ సిరీస్‌కి బ్యాక్‌బోన్ అని నిర్మాత నవీన్ మేడారం చెప్పారు. సొంతూరితో ముడిపడ్డ జ్ఞాపకాల సమాహారం ఈ సిరీస్ అనీ, చివరి ఎపిసోడ్ మాత్రం మిస్ కావొద్దని దర్శకుడు తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ అంతా మాట్లాడారు.
