Skip to main content

Namaste NRI

సొంతూరు జ్ఞాపకాలతో హోం టౌన్‌

ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంలో రూపొందిన వెబ్‌సిరీస్‌ హోం టౌన్‌. రాజీవ్‌ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్‌ యాద్మ, సాయిరామ్‌, అనీ, అనిరుధ్‌, జ్యోతి ప్రధానపాత్రధారులు. శ్రీకాంత్‌రెడ్డి పల్లే దర్శకుడు. నవీన్‌ మేడారం, శేఖర్‌ మేడారం నిర్మాతలు. రేపటి నుంచి ఈ సిరీస్‌ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ వెబ్‌ సిరీస్‌ స్పెషల్‌ ప్రివ్యూను హైదరాబాద్‌లో ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్‌ మాట్లాడారు.

ఈ సిరీస్‌ ఓ జ్ఞాపకాల దొంతర అని, ఇందులోని పిల్లల అల్లరి చూస్తుంటే ఓ 35ఏళ్లు వెనక్కు వెళ్లిపోయానని, టెక్నికల్‌గా మంచి క్వాలిటీతో రూపొందిన సిరీస్‌ ఇదని రాజీవ్‌కనకాల పేర్కొన్నారు. 90s ఎ మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌ తర్వాత తమ సంస్థ నుంచి వస్తున్న సిరీస్‌ ఇదని, దేవ్‌ దీప్‌ గాంధీ కుండు కెమెరా, సురేశ్‌ బొబ్బిలి సంగీతం ఈ సిరీస్‌కి బ్యాక్‌బోన్‌ అని నిర్మాత నవీన్‌ మేడారం చెప్పారు. సొంతూరితో ముడిపడ్డ జ్ఞాపకాల సమాహారం ఈ సిరీస్‌ అనీ, చివరి ఎపిసోడ్‌ మాత్రం మిస్‌ కావొద్దని దర్శకుడు తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్‌ అంతా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events