అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1,265 కేజీల భారీ లడ్డును తయారు చేయించారు. దీన్ని వీరు అయోధ్యకు పంపించనున్నారు. ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిన మొదలు రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా నాగభూషణం దంపతులు అదే సంఖ్య బరువు గల లడ్డు తయారు చేయించారు. బుధవారం ఉదయం 6 గంటలకు పికెట్లోని తమ నివాసం నుంచి లడ్డు శోభాయాత్రను ప్రారంభిస్తామని నాగభూషణం రెడ్డి తెలిపారు.