కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీపడే టీఆర్‌ఎస్ అభ్యర్థిని నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌నే హుజూరాబాద్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు సమాచారం. ఆయన పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో ప్రకటించనున్నారు. శ్రావణ మాసం మంచి రోజు కావడంతో ఈ మేరకు నిర్ణయించారని సమచారం. దళిత బంధు పథకం ప్రారంభ సమావేశ సందర్భంగా.. 16న హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిచయం చేయనున్నారు.