Namaste NRI

ఐయామ్‌ హ్యాండ్సమ్‌ ట్రైలర్ లాంచ్

దుర్గాదేవ్‌ నాయుడు హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఐయామ్‌ హ్యాండ్సమ్‌. కే ఫిల్మ్‌ పతాకంపై కేథార్‌నాథ్‌ నిర్మించారు. అన్విష కథానాయిక ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. తండ్రీకొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ అనే అంశాలు చుట్టూ అల్లుకున్న భావోద్వేగభరిత కథాంశమిదని, సరికొత్త కాన్సెప్ట్‌తో మెప్పిస్తుందని హీరో, దర్శకుడు దుర్గాదేవ్‌ నాయుడు చెప్పారు. పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా హార్ట్‌టచింగ్‌గా ఉంటుందని నిర్మాత కేథార్‌నాథ్‌ అన్నారు. కిట్టయ్య, రూపకళ, ఫణింద్ర తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.నాగార్జున రాయల్‌, సంగీతం: ఎస్‌.ఎస్‌.ప్రసూ, కథ, దర్శకత్వం: దుర్గాదేవ్‌ నాయుడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events