Namaste NRI

చంద్రబాబుకు మద్దతుగా న్యూజెర్సీలో ఐయామ్‌ విత్‌ సీబీఎన్‌

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకు అమెరికాలో మద్దతు పెరుగుతోంది. తెలుగు ప్రజలు, ఐటీ పారిశ్రామికవేత్తలు బాసటగా నిలుస్తున్నారు. ఐయామ్‌ విత్‌ సీబీఎన్‌ అంటూ అమెరికాలోని న్యూజెర్సీలో కోర్ట్‌ల్యాండ్‌ సెయింట్‌లోని అక్బర్‌ రెస్టారెంట్‌ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గుడివాడ నియోజక వర్గ టీడీపీ నాయకులు వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రులు చంద్రబాబుకు మద్దతుగా ఐయామ్‌ విత్‌ సీబీఎన్‌ అంటూ నినదించారు. ఎన్‌ఆర్‌ఐలు విత్‌ సీబీఎన్‌ అంటూ అండగా నిలిచారు. ఎన్నారైలు విత్‌ సీబీఎన్‌ అంటూ తమ సంఫీుభావాన్ని ప్రకటించారు.  ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడీపీ, ఎన్నారై జనసేన నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News