Namaste NRI

తప్పు చేశా.. క్షమించండి : బిల్‌గేట్స్‌

ఎప్‌స్టీన్‌ ఫైళ్ల కేసులో ఇరుక్కున్న మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ క్షమాపణ చెప్పారు. తనకు ఇద్దరు రష్యా మహిళలతో సంబంధం ఉన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. అయితే జెఫ్రీ ఎప్‌స్టీన్‌ బాధితులతో తనకెలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న సంబంధాల కారణంగా జరిగిన పరువు నష్టానికి ఆయన గేట్స్‌ ఫౌండేషన్‌ సిబ్బందికి క్షమాపణలు చెప్పారు.ఇది పెద్ద తప్పేనని అంగీకరించారు. నేనే అక్రమం చేయలేదు. నేనే అక్రమం చూడలేదు అంటూ ఒక కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవల విడుదలైన ఎప్‌స్టీన్‌ ఫైళ్లలో కొందరు మహిళలతో బిల్‌గేట్స్‌ ఉన్న ఫొటోలపై ఆయన మాట్లాడుతూ వ్యాపార సమావేశాల తర్వాత జెఫ్రీ ఎప్‌స్టీన్‌ అభ్యర్థన మేరకు అవి తీశారని, అందులో ఎప్‌స్టీన్‌ సహాయకులు కూడా పాల్గొన్నారని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events