Namaste NRI

కమల్‌ హాసన్‌కు రాని అదృష్టం నాకు వచ్చింది: జేడీ చక్రవర్తి

తరుణ్‌భాస్కర్‌ హీరోగా రూపొందుతున్న యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గాయపడ్డ సింహం. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. చక్రవర్తి మంతిన, భానుకిరణ్‌ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేష్‌ బన్సాల్‌ నిర్మాతలు. పవన్‌ సాధినేని సమర్పకుడు. జేడీ చక్రవర్తి పోషిస్తున్న ధర్మ పాత్రను పరిచయం చేస్తూ రూపొందించిన గ్లింప్స్‌ని సోమవారం హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో జేడీ చక్రవర్తి మాట్లాడారు. నటులందరికీ కొలమానం కమల్‌హాసన్‌. ప్రపంచ సినీచరిత్రలో ఆయన చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు ఎవరూ చేయలేదు, చేయబోరు. అయితే గాయపడ్డ సింహం లో నేను పోషించిన ధర్మ తరహా పాత్ర ఆయనక్కూడా రాలేదు. ఆయన కూడా చేయలేదు. ఇది నాకు మాత్రమే దక్కిన అదృష్టం. ఈ పాత్రలో చాలా వేరియేషన్స్‌ ఉంటాయి. ఇది నా కెరీర్‌లోనే గుర్తుండిపోయే పాత్ర. కశ్యప్‌ తప్పకుండా ఇన్నోవేటివ్‌ డైరెక్టర్‌ అవుతాడు. పవన్‌ సాధినేని భుజాలపై ఈ సినిమాను మోశాడు. ఇది డైరెక్టర్స్‌ సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

ఇందులో జేడీ చక్రవర్తి మాఫియా డాన్‌గా నటిస్తున్నట్టు గ్లింప్స్‌ చెబుతున్నది. మాఫియా డాన్‌ ధర్మ చేసే ఆయుధాల అక్రమ రవాణా, డ్రగ్స్‌ తదితర యాక్టివిటీస్‌ని ఈ గ్లింప్స్‌లో చూడొచ్చు. జేడీ చక్రవర్తి స్క్రీన్‌ప్రెజెన్స్‌, ‘బ్రూటల్‌ ధర్మ’గా ఆయన మేకోవర్‌ ఆకర్షణీయంగా ఉంది. ఇంకా ఈ కార్యక్రమంలో పవన్‌ సాదినేని, డైరెక్టర్‌ కశ్యప్‌, నిర్మాత భాను కిరణ్‌ ప్రతాప కూడా మాట్లాడారు. ఈ సినిమా మే 1న సినిమా రిలీజ్‌ కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events