Namaste NRI

ఐకాన్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌  ప్రదానోత్సవం

వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన వారి కృషికి మంచి గుర్తింపు ఇవ్వాలనే ప్రయత్నంతో విజన్ స్టూడియోస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 పేరుతో అవార్డ్స్ అందించారు. సినీ, విద్యా, వైద్యం, రియల్ ఎస్టేట్ ఇలా పలు రంగాల్లో ఈ అవార్డ్స్ అందించారు. విజన్ స్టూడియోస్ మొదటి సారిగా నిర్వహించిన ఈ అవార్డ్స్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ లో అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  టీఎఫ్‌సీసీ ఛైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్‌, నటి దివ్యవాణి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News