అగ్రరాజ్యం అమెరికాను హెన్రీ తుపాను దెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మరో తుఫాన్ విరుచుకుపడిరది. న్యూయార్క్, న్యూజెర్సీ, రాష్ట్రాల్లో ఐడా తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. భారీ వర్షాల కారణంగా ఈ రెండు రాష్ట్రాలు జలమయం అయ్యాయి. 14 మంది చనిపోయారు. రవాణా సేలను పూర్తిగా నిలిపివేశారు. న్యూయార్క్ నగరంలో ఓకే ఇంట్లో ముగ్గురు చనిపోగా వీరిలో రెండేండ్ల బాలుడు ఉన్నాడు. భారీ వర్షాలతో న్యూయార్క్, న్యూజెర్సీల్లో రోడ్లు, సబ్‌వేలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు.
నేషనల్ వెదర్ సర్వీస్ మొట్ట మొదటి సారి ఆకస్మిక వరద హెచ్చరికలను జారీ చేసింది. న్యూయార్క్‌లో ఒక్క గంటలోనే 9 సెంటీమీటర్ల వాన కురిసింది. తుఫాను క్రమంగా న్యూ ఇంగ్లండ్ వైపు కదులుతున్నది. ఈ క్రమంలో భారీ టోర్నడోలు సంభవించవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.